హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): వక్ఫ్‌బోర్డ్ ఆస్తుల అక్రమాలపై సీబీసీఐడీ విచారణను ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వక్ఫ్‌బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. వక్ఫ్ ఆస్తులపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే దర్గా భూములను కాజేసే కుట్ర జరిగిందని, హుస్సేన్-ఇ-షావలీ దర్గా భూములను ల్యాంకో హిల్స్‌కు కట్టబెడుతూ జీవో ఇచ్చారని గుర్తుచేశారు. చేవెళ్లలోని బియాబానీ దర్గా భూములను అమ్మేందుకు జీవోలు తెస్తే మహమూద్ అలీతోపాటు వందలమందితో కలిసి పోరాటం చేశామని తెలిపారు. కొత్తగా 3.90 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినం. ఇంకా ఎవరైనా పేదలుంటే వారికీ కచ్చితంగా ఇస్తాం’ అని సీఎం తెలిపారు.