CM KCR Press meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ సెటైర్ వేశారు. పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ అని ఎద్దేవా చేశారు. రోజురోజుకీ ఆ పార్టీ పరువు పోతుందని అన్నారు. ఆదివారం ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మోదీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన. శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు.. ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం ఇస్తున్నరు. ఇన్ని ఉండంగ.. మొన్న బడ్జెట్లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం. దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..? పెట్టుమనందే జగన్మోహన్రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా. పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్. ఎఫ్ఆర్బీఎం పవర్ రీఫామ్స్ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. మీటర్లు పెట్టుమనుడు వేరు అని ప్రెస్మీట్లో కేసీఆర్ అన్నారు.