ఆ రోజంతా నిద్ర పోలేదు.. బాగా ఏడ్సిన : సీఎం కేసీఆర్
TRS Plenary | హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవేదనకు లోనయ్యారు. మహిళా సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవేదనకు లోనయ్యారు. మహిళా సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఓ సమావేశానికి వెళ్లే ముందు.. ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పి ఇద్దరు బాలికలు తన వద్దకు వచ్చారు. మేము అనాథ పిల్లలం.. కేజీబీవీలో చదువుతున్నాం. టెన్త్ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోతామో తెలుస్తలేదు అని ఆ పిల్లలు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం.. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి. ఆ రోజంతా నిద్ర పోలేదు.. బాగా ఏడ్సిన మనసులో అని కేసీఆర్ తెలిపారు.
నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే.. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించాను. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణను రూపొందించి తీసుకువస్తామన్నారు. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశాం. హాస్టల్స్‌ను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ కింద ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు తల్లిదండ్రులు. వారిని ఆదరించాలి. అనాథ బిడ్డలు తారసపడితే వారిని చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

