హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): దళితుల సాధికారత కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆరోగ్యశాఖలో ఆహారం అందించే సంస్థలు, పారిశుద్ధ్య, భద్రత ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై వంగపల్లి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ మాదిగల పక్షపాతని అభివర్ణించారు. రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, చొరవ చూపిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు డిక్కీ కృతజ్ఞతలు
డైట్ ఏజెన్సీలలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్‌పై దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) హర్షం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దళితుల సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ దేశంలోనే ముందున్నారని కొనియాడింది. దళితుబంధు పథకం విప్లవాత్మకమని అభివర్ణించింది. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, అక్కడా వాటి అమలుకు కృషి చేస్తామని డిక్కి నేషనల్ ప్రెసిడెంట్ నర్రా రవికుమార్, తెలంగాణ ప్రెసిడెంట్ దాసరి అరుణ, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కిరణ్ చంటి, ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా కో ఆర్డినేటర్ కత్తెరపాక రవి, ట్రైబల్ కో ఆర్డినేటర్ సురేశ్‌నాయక్ పేర్కొన్నారు.