హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు సీఎం కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. పూజల్లో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.