CM KCR | సాయిచంద్ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు
SAI Chand | తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులు అర్పించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయిచంద్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఎదుట సాయి చంద్ భార్య బోరును విలపించింది. కేసీఆర్ను చూసి ఆమె దుక్కాన్ని తట్టుకోలేకపోయింది. ఏడుస్తున్న సాయి చంద్ భార్యను సీఎం కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ తోపాటు మంత్రి హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ పుష్ప నివాళులు అర్పించారు.
సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని పేర్కొన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తంచేశారు.

Cmkcr Tributes1

Cmkcr Tributes2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

