CM KCR | ముందస్తు ఊసే లేదు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ పోరు
CM KCR | ఈసారి షెడ్యూల్ ప్రకారం గడువు దాటిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఇప్పుడు తెలంగాణకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చెప్పారు. తమకు 103 ఎమ్మెల్యేలతో పూర్తి మెజారిటీ ఉన్నదని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీ ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. కొందరు భేవకూప్గాళ్లు అదేపనిగా చెబుతున్నారు.. మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా.. వాడెవడో కుక్కగాడు మొరిగితే ముందస్తు ఎన్నికలకు వెళతమా అని కేసీఆర్ నిలదీశారు.
ఇంతకుముందు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులు, కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందువల్లే సరైన టైంలో 8 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని తెలిపారు.
ఈసారి షెడ్యూల్ ప్రకారం గడువు దాటిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 స్థానాల్లో గెలుపొందుతుందని సంచలన ప్రకటన చేశారు. ‘ ఇందులో సందేహం లేదు. ఇది నామాట. ఈ సారి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి నా దగ్గర మంత్రం ఉంది. ఇంతకుముందు ముందస్తు ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు వెళ్లినం.. ఈసారి ఆరు నెలల ముందు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తాం అని చెప్పారు. ఎవడో మెదడు లేనోడు. పిచ్చినాకొడుకు చెప్పినడని ముందస్తు ఎన్నికలకు వెళ్లం’ అని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Assembly Poll
- CM KCR
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

