తిమ్మాపూర్, నవంబర్ 20: మానకొండూరు ని యోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సును కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రేణికుంట టోల్గేట్ వద్ద సోమవారం కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. బస్సులో అణువణువునూ పరిశీలించాయి. బస్సులోని సిబ్బంది వారికి సహకరించి, ప్రతి బ్యాగు చూపించారు. బస్సులో ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో సభకు పంపించారు.