మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలంలో దేశ రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదగాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు దేశంలో అమలు చేసే విధంగా ముఖ్యమంత్రికి వనదుర్గామాత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గ భవాని మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.