ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ రోజు జనగామలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జనగామలో నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీని తర్వాత జనగామ టీఆర్ ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో మంత్రులు, జిల్లా నేతల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తర్వాత జనగామలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.
బీజేపీ నేతలు మా జోలికొస్తే నశం చేస్తాం
మేం ఊదితే అడ్రస్ గల్లంతే
టీఆర్ ఎస్ ఉద్యమ పార్టీ.. సాధన కోసం కొట్లాడిన పార్టీ
అవసరమైతే ఢిల్లీ దాకా వస్తాం
మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొడతాం
మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాం
మోదీ రైతుల వెంబడి, పేదల వెంబడి పడ్డాడు
నీరవ్ మోదీ, మాల్యాలు ఎవరి పుణ్యంతో విదేశాలకు వెళ్లిపోయారు..
మోదీపై తిరగబడతం.. కొట్లాడతాం
మోదీ ఖబడ్దార్.. ఇది తెలంగాణ
ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడం
దేశం నుంచి మిమ్మల్ని తరిమేస్తాం
మాకు ఇచ్చేవాడ్ని తెచ్చుకుంటాం
మీ సంస్కరణలు అమలు చేయం.. మోదీ ఏం చేసుకుంటావో చేసుకో...
ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడానికి సిద్ధం
దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడడానికి సిద్ధం
కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. 8 ఏళ్లుగా కేంద్రంతో ఏనాడు గొడవ పెట్టుకోలేదు.. నిధులు ఇవ్వకున్నా కడుపుకట్టుకొని పనిచేశాం. కరెంటు సంస్కరణ పేరుతో ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోంది.. కానీ నన్ను చంపినా పెట్టనని మోదీతో చెప్పిన
టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరి కళ్లు మంటపెడుతున్నాయి
ఈ యేడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితులు ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారు.
తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధును అమలుచేస్తాం
ఏప్రిల్ నెలలో కూడా చెరువులు మత్తడి దుంకాలి. ఘనపురంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. జనగామకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం