శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 17:56:26

గాలివాటంగా ఓటేయొద్దు : సీఎం కేసీఆర్‌

గాలివాటంగా ఓటేయొద్దు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఎప్పుడైన ఎన్నికల్లో ఓటు వేసేముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకుడదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. పండుకుందా.. నిద్రపోయిందా.. లేచిందా.. పనిచేస్తుందా.. చేస్తే ఎవరికి చేస్తుంది.. ప్రభుత్వ వైఖరి ఏంది.. ప్రభుత్వ లక్షణం ఏంది.. ఎవరికోసం తపన పడుతుంది. ఇవన్నీ యోచించాలన్నారు. గత ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్లముందే ఉందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరవాసులకు తానొక్కటే విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సీఎ కేసీఆర్‌ తెలిపారు. ఎల్బీనగర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సభకు విచ్చేసిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. అందరికీ తానొకటే మాట విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. సందర్భాలు చాలా వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. ఎన్నికల్లో విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. 

ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. వాళ్ల దృక్పథం ఎలా ఉంది. వాళ్ల వైఖరి ఏ విధంగా ఉంది. వాళ్లు ఏ విధంగా అభివృద్ధిపై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు కోసం వాళ్లు అవలంభిస్తున్న విధానాల మీద చర్చ జరగాలే. వాళ్లు వాళ్లు ప్రతిపాధించుకున్న ఎజెండా మీద చర్చ జరగాలి. అట్లా జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. మంచి మంచి నిర్ణయాలు వస్తాయన్నారు. మంచి పార్టీలు ఎన్నుకోబడతాయన్నారు. అప్పుడే పనిచేసేవాళ్లు చాలా మంది పుట్టుకొస్తారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అవలంభిస్తున్న పద్ధతి ఇదేనని సీఎం పేర్కొన్నారు.   


logo