హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించింది. ఆయన కాల్‌డేటా ఆధారంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితోపాటు వైఎస్ భారతి ఇంట్లో పని చేసే నవీన్‌కు నోటీసులు ఇచ్చింది. దీంతో వారు కడప కేం ద్ర కారాగారంలో సీబీఐ విచారణకు శుక్రవా రం హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవ ర్ దస్తగిరి, రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ఫిబ్రవరి 10న విచారణకు రానున్నారు.