హైదరాబాద్, మార్చి24 (నమస్తే తెలంగాణ) : సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ పథకం కింద ఎంపికైన 18 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ నిధుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. పథకం ద్వారా మొత్తం రూ.23.44 కోట్ల విలువైన యూనిట్లకు ఆమోదం లభించింది. రూ.8.16 కోట్ల సబ్సిడీ చెకులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
మంచిర్యాల, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ను జిల్లా కోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. గతంలోనే మంచిర్యాల సెషన్స్ కోర్టు కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో బీ ఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే బెయిల్ వచ్చినప్పటికీ.. ప్రాసిక్యూషన్ జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కొన్ని రోజులుగా వాదనలు విన్న మంచిర్యాల జిల్లా కోర్టు మంగళవారం సదరు పిటిషన్ను డిస్మిస్ చేసిందని బాల్కసుమన్ తరఫు న్యాయవాదులు తెలిపారు.