హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. దక్షిణ డిస్కమ్‌లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తూ 2025 అక్టోబర్ 10న మరణించిన వరుస సురేశ్, మహబూబ్‌నగర్ సర్కిల్లో పనిచేస్తూ మరణించిన ఆర్టిజన్ ముక్తార్బేగ్ కుటుంబాలకు చెక్కులు అందజేశారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఆధార్ అనుసంధానం లేని కారణంగా నిలిచిపోయిన ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. వ్యవసాయశాఖలో నిలిచిపోయిన వేతనాలు చెల్లించాలని కోరుతూ టీఎన్జీవో నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అసెంబ్లీలో కోరారు. విద్యాశాఖలో 221మంది టీచర్ల వేతనాలు నిలిపివేశారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, టీ పెంటయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరారు.