హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ముగ్గురి కంటే ఎక్కువ మందిని కన్నవాళ్లే నిజమైన దేశభక్తులు అని, అలాంటి వారిని గౌరవిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలుచేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలోని వెలగపూడి సచివాలయం వద్ద ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం పెద్దవనరు అని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లల ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని గతంలో తానే చట్టం తీసుకొచ్చినట్టు చెప్పారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని సూచించారు. జనాభా అంటే భారం కాదని, జనమే ఆస్తి అని చెప్పారు.