హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయానికి ప్రస్తుతం ఇన్ఫ్లో 42,175 క్యూసెక్కులు వస్తున్నది. ఔట్ ఫ్లో 49,192 క్యూసెక్కులు ఉన్నది. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.7 అడుగుల మేర నీరున్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.