నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి నియోజక వర్గంలో షబ్బీర్ అలీ ఫొటోతో కూడిన గోడ గడియారాలు కలకలం రేపుతున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్ హస్తం గుర్తు, షబ్బీర్అలీ ఫొటోతో కూడిన గడియారాలు కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. గోడ గడియారాల్లో ఆగస్టు 22వ తేదీ ముద్రించి ఉండటాన్ని గమనిస్తే ఎన్నికల కోడ్ పరిధిలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతున్నట్టుగా అర్థమవుతున్నది.