ఖైరతాబాద్, మార్చి 21: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు చెల్లదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. వర్గీకరణ అంటే దళితుల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా జరగాల్సి ఉన్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కారంచేడు ఘటన జరిగినప్పుడు మాలమాదిగలంతా కలిసి పోరాడినట్టు గుర్తుచేశారు. అయి తే, ఆరెండు వర్గాలు కలిసి ఉంటే తమ మనుగడ సాధ్యం కాదని భావించి వారిని విడగొట్టాలన్న ఆలోచనతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిటీ వేసి దొంగలెక్కలు చూపి వర్గీకరణ చేసినట్టు తెలిపారు. మాదిగలతో లబ్ధిపొందాలని బీజేపీ, ఏపీలో ఓటు బ్యాంక్‌గా వాడుకోవాలని టీడీపీ గతంలోనే కుట్రపన్నినట్టు ఆరోపించారు.
ప్రస్తుత వర్గీకరణ సైతం ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. 341 ఆర్టికల్‌ను సవరించి వర్గీకరణ అమలుచేయాల్సి ఉంటుందని, అం దుకు పార్లమెంట్లో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. సుప్రీం తీర్పు ప్రకారం క్రీమీలేయర్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, తెలంగాణలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లులో ఆ అం శాన్ని తీసుకోలేదని, మని వర్గీకరణ ఎ లా చెల్లుతుందని ప్రశ్నించారు. ఇందులోనూ మతలబు ఉందని, మళ్లీ కోర్టు లు వర్గీకరణ కేసును కొట్టివేయాలన్నది వారి ఉద్దేశమన్నారు. వర్గీకరణ విషయంలో మరోసారి కోర్టుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణలో హామీ ఇచ్చిన 6 పథకాల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోగా, ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు.