హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హెల్త్ అండ్ కాంప్రహెన్సీవ్ వెల్నెస్ కోర్సుపై సెప్టెంబర్ 22 నుంచి బ్యాచ్‌ల వారీగా తరగతులు నిర్వహించనున్నట్టు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఎండీ శాంతికుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఐదు బ్యాచ్‌ల ద్వారా అభ్యర్థులకు ఈ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
ప్రతి బ్యాచ్‌కు 50మంది అభ్యర్థులు ఉంటారని, కోర్సు ఫీజు రూ.35000 నిర్ణయించినట్టు తెలిపారు. దరఖాస్తులు, ఇతర పూర్తి వివరాల కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.