హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ, యూజీ కళాశాలల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని ఓయూ అధికారులు స్పష్టం చేశారు. పీజీ, డిగ్రీ విద్యార్థులందరూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఓయూ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఓయూ పరిధిలోని పీజీ, యూజీ కళాశాలల్లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులే నిర్వహిస్తామని సోమవారం మధ్యాహ్నం ఓయూ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై విద్యాశాఖ ఆగ్రహించడంతో.. ఓయూ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.