కొండమల్లేపల్లి, జూన్ 15 : పాఠశాల ప్రారంభమైన తొలిరోజే ఓ విద్యార్థి ప్ర మాదానికి గురైన ఘ టన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్నది. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యా యి. ఈ క్రమంలో కొండమల్లేపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు మామిడాకుల తోరణం కట్టేందుకు సాయంగా రమ్మని పక్కనే ఆడుకుంటున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు శ్రీధర్ పిలిచారు. ఆ విద్యార్థి ప్రహరీ ఎక్కి తోర ణం కడుతుండగా పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్తు తీగలు తగిలి షాక్‌కొట్టడంతో గోడపై నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
వెంటనే ఉపాధ్యాయులు, స్థానికులు విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు ఎంఈవో నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థి నాంపల్లి మండలం తిమ్మాపురానికి చెందిన కొత్తగొల్ల రాంచరణ్‌గా గుర్తించారు. ఇతడు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనకు కారకుడైన ఉపాధ్యాయుడు శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో దేవరకొండ ఆర్డీవో పద్మప్రియ ఘటనాస్థలాన్ని సందర్శించారు.