మేడ్చల్: ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపల్ మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మేడ్చల్ (Medchal) పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో అఖిల (16) పదో తరగతి చదువుతున్నది. సోమవారం స్కూల్‌కి వెళ్లిన అఖిలను.. ఫీజు చెల్లించలేదని తోటి విద్యార్థుల ముందు ప్రిన్సిపల్ మందలించారు.
దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని మంగళవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురవడంతో యశోద దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.