హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థి సంఘాల మధ్య(Student unions,) ఘర్షణ(Clash) నెలకొంది. ఏబీవీపీ(ABVP) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ(SFI), ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ గొడవలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు సర్దిచెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.