హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ల నియామకాల కోసం ఇటీవల నిర్వహించిన ఇంగిష్ రెండో పేపర్ పరీక్షలోని 37 ప్రశ్నలపై టీఎస్పీఎస్సీ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.