హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాలకు సెలవులపై స్పష్టత కొరవడింది. ఇంతకు సెలవులిస్తారా ? లేదా? అన్నది సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 30న ఉగాది కాగా, ఆ వెంటే (ఈ నెల 31న లేదా ఏప్రిల్ 1) రంజాన్ పండుగ రానున్నది.
మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా 19 మూల్యాంకన కేంద్రాల్లో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం నడుస్తున్నది. అధ్యాపకులు, సిబ్బంది అంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు పండుగలకు నో వర్క్ నో పే కింద సెలవు ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) అధ్యక్షప్రధాన కార్యదర్శులు వీ శ్రీనివాస్, కే సురేశ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి క్రిష్ణాదిత్యను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.