హైదరాబాద్ : తెలంగాణలో తొలి నవలగా చరిత్ర సృష్టించిన వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి నవలను చదివానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను సీజేఐ సందర్శించారు.
ప్రజల మనిషి నవలను సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ పరిచయం చేశారు. ఆ నవలను తాను చదివానని చాలా బాగుందని తెలిపారు. సీజేఐ బుక్‌ఫెయిర్ అంతా కలియతిరాగారు. విశాలాంధ్ర బుక్ స్టాల్లో శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకాన్ని చూసి ఈ బుక్‌ను ఎన్నో సార్లు చదివానని, నాకు మిత్రులు కూడా ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చే వారని సీజేఐ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.