హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): బీజేపీ అమలుచేస్తున్న ఆపరేషన్ లోటస్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ డబ్బు ఎరజూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం అత్యంత సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) అధికారులు, ఈడీ, సీబీఐ, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.