హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): ప్రజల ఆశలకు అనుగుణంగా, వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్లో కమిషనర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, బాగా పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా మూడున్నరేండ్లుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన అనిల్‌కుమార్‌కు ఉద్యోగులు ఘనంగా వీడోలు పలికారు.