Osmania University | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఓయూతోపాటు ఆ వర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులకు మాత్రమే సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఉచిత శిక్షణ అవకాశం కల్పిస్తున్నట్టు ‘సివిల్ సర్వీస్ అకాడమీ’ అధికారులు నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. సర్కారు, ఓయూ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దరఖాస్తులకు నెలాఖరు వరకు గడువు విధించారు.