విజయవాడ, జనవరి 19: హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ (సీఐఎస్ఆర్) ఏర్పాటుకు పునాదిరాయి పడింది. ఆదివారం విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. సీఐఎస్ఆర్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అధికారుల్లో ఫైరింగ్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అత్యాధునిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న సీఐఎస్ఆర్ ఐపీఎస్ ప్రొబేషనర్ల శిక్షణలో కీలకపాత్ర పోషించనున్నది.