చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి
తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లి దవాఖానలో చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సోమవారం జరిగింది.
- గత నెల 16న జరిగిన ప్రమాదంలో తలకు గాయమై కోమాలోకి
బోయినపల్లి, జనవరి 1: తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లి దవాఖానలో చికిత్స పొందుతూ సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ జవాన్ మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సోమవారం జరిగింది. చాడ శివకుమార్(26) రెండేండ్ల క్రితం సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) విభాగంలో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్లోని 16వ బెటాలియన్ డిలోలీలో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలోనూ అర్హత సాధించగా.. ట్రైనింగ్ సమయం కావడంతో తిరిగివెళ్లాడు. గతేడాది దసరా పండుగకు ఇంటికొచ్చిన శివకుమార్.. తిరిగి విధుల్లో చేరాడు. ఈ క్రమంలో గత డిసెంబర్ 16న ప్రమాదవశాత్తు కిందపడి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. అధికారులు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా.. సోమవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

