హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అధికారిక అనుమతులు లేని ప్రవేశాలు, అక్రమ కళాశాలల నిర్వహణను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది.
100 కళాశాలలపై చర్యలు తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిబంధనలు పాటించని కళాశాలలకు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించినట్టు స్పష్టం చేసింది.