హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దేశంలోనే మొదటిసారిగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్ విధానంలో నాలుగు కోర్సులు అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం తెలిపినట్టు సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పాచక్రపాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 8 కోర్సులకు ఐప్లె చేసుకోగా అందులో ఎంఏ (తెలుగు), ఎంకామ్, బీకామ్(ఇంగ్లిష్ మీడియం), బీకామ్ (తెలుగు మీడియం)లకు యూజీసీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.