Fake Passport | నకిలీ పాస్‌పోర్టు కేసు.. వారిపై లుకౌట్ నోటీస్ జారీచేసిన సీఐడీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look Out Notice) జారీ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look Out Notice) జారీ చేశారు. వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపించారు. ఆ 92 మందిని వెనక్కి రప్పించి విచారించాలని భావిస్తున్న అధికారులు.. వారి పాస్‌పోర్టులను రద్దు చేయాలని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్‌కు సీఐడీ లేఖ రాసింది.
ఒకే ఆధార్ నంబర్‌తో అనేక చిరునామాలు, ఫేక్ పత్రాలు సృష్టించి 92 మంది పాస్‌పోర్టులను పొందారు. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఈ కుంభకోణంలో ఏజెంట్లు, పాస్‌పోర్టు సిబ్బంది, ఎస్బీ సిబ్బంది కుమ్మక్కయినట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. జగిత్యాలతోపాటు ఫలక్‌నుమా చిరునామాలతో నకిలీ పాస్‌పోర్టులు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు. కాగా, మిగిలినవారైనా ఇతర దేశాలకు పారిపోకుండా సీఐడీ చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

