CI Ravikumar | కాజీపేట, అక్టోబర్ 23: హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సీఐ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సీఐ రవికుమార్ కుటు ంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఈయన నివాసం ఉండే అపార్ట్మెంట్లోనే ఆయన కూతురి స్నేహితురాలి కుటుంబం కూడా ఉంటున్నది. సీఐ ఆ బాలికపై కన్నేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటన ఈ నెల 9వ జరిగినప్పటికీ బాధితులు మంగళవారం రాత్రి కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.