ఏటూరునాగారం, ఫిబ్రవరి 3: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని కొండలు, గుట్టలపై నుంచి నిత్యం వస్తున్న జలధార ఎంతో స్వచ్ఛమైనదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. చింతామణి పేరుతో మల్లూరులోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి గుట్టపై నుంచి ఏడాది పొడవునా వచ్చే నీరు తాగేందుకు ఎంతో శ్రేష్టమైనవిగా తేలిం ది. ఈ నీటిని వాటర్ ల్యాబోరేటరీ చీఫ్ కెమిస్ట్రీ కృష్ణమూర్తి సమక్షంలో 3రోజులపాటు 32 రకాల పరీక్షలు చేపట్టారు. ఇందులో ఫ్లోరైడ్, క్లోరైడ్ లేదని స్పష్టమైంది. ఈ గుట్టపై ఉన్న అనేక రకాల వన మూలికల వృక్షాలు ఉండటంతో వీటి వేర్లను తాకుతూ వచ్చే నీరు ఎంతో శుద్దిగా ఉన్నట్టు వెల్లడైంది.