హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 25, 27 తేదీల్లో జరిగే పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీరామనవమి వేడుకలకు రావాలని కేసీఆర్‌కు ఆయన స్వగ్రామం చింతమడక ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
శుక్రవారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్‌రావు నేతృత్వంలో చింతమడక సీతారామాలయ కమిటీ బాధ్యులు ఆకుల రామాగౌడ్, పెండల గణేశ్, బైరి నర్సింహారెడ్డి, వాతం శివ, పడకంటి విశ్వనాథం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు కేసీఆర్‌ను కలిశారు.