China Manja | నవీపేట, జనవరి 13: పశువుల కోసం బైక్పై గడ్డి తీసుకెళ్తున్న రైతుకు చైనామాంజా తగిలి గొంతు కోసుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఆర్మూర్ మణికాంత్ పశువుల మేత కోసమని గడ్డి కోసేందుకు మంగళవారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. గడ్డి తీసుకుని బైక్పై ఇంటికి వస్తుండగా, చైనామాంజా తగిలి ఆయన గొంతుకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ శ్రీనివాస్, స్థానికులు బాధితుడిని నందిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మణికాంత్కు కుట్లువేసిన వైద్యులు ప్రాణాపాయంలేదని చెప్పారు.
హైదరాబాద్,జనవరి 13 (నమస్తే తెలంగాణ): గాలిపటాలు కేవలం ఆడుకునే ఆట మాత్రమే కావని, ప్రజ ల సంస్కృతి, సామూహిక ఆనందం, సమానత్వం, స్వేచ్ఛాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకలు అని సీపీఐ సెం ట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అన్నారు. మంగళవా రం ఆయన తిరుపతిలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్రాంతికి గాలిపటాలకు విడదీయరాని సం బంధం ఉన్నదని తెలిపారు. పల్లె-పట్టణం, ధనిక, పేద అనే తేడా లే కుండా అందరూ కలిసి ఆనందించేది గాలిపటాల వేడుక అని పేర్కొన్నారు.