హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సదుపాయాల్లో అనేక లోపాలు ఉన్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ తెలిపింది.
ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో సదుపాయాలపై తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో జరుగుతున్న సంఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది.