సమాజానికి శాపంగా బాల్య వివాహాలు
బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్ శామ్కోషి పేర్కొన్నారు.
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్కోషి
కామారెడ్డి, జనవరి 31: బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్ శామ్కోషి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తాధ్వర్యంలో ‘మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రసంగించారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేస్తే తల్లిదండ్రులు, పెద్దలు, మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాల నివారణ, మహిళలపై వేధింపుల నిరోధానికి చట్టాలపై అవగాహన అవసరమని హైకోర్టు న్యాయమూర్తి నర్సింగరావు నందికొండ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు సుష్మ, దీక్ష, భార్గవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

