Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో రేవంత్ బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ రేవంత్‌ను పరీక్షించి, మందులు సూచించినట్లు తెలుస్తోంది.
నిన్న సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలోనూ రేవంత్ కొంత నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరమే రేవంత్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.