హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి కేరళలో ఉండగా, డిప్యూటీ సీఎం పంజాబ్లో ఉన్నా రు. మంగళవారం ఉదయం వీరిద్దరూ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అవతరణ వేడుకలకు హాజరయ్యేందుకు సోనియాగాంధీ సుముఖత వ్యక్తం చేస్తారా? లేదా? అనేదానిపై చర్చ జరుగుతున్నది. మరోవైపు సోనియాను ఎలా అహ్వానిస్తారని పలువురు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.