దామగుండంలో నేవీ రాడార్ వద్దు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్‌ను నిర్మించరాదని, దీన్ని వేరే చోటుకు మార్చాలని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి శనివారం లోక్‌సభలో ప్రస్తావించారు.
- మరో ప్రాంతానికి మార్చండి
- లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్‌ను నిర్మించరాదని, దీన్ని వేరే చోటుకు మార్చాలని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి శనివారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని కోరారు. పార్లమెంటులో 377వ నిబంధన కింద ఆయన ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించి.. నేవీ రాడార్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించారు.
రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల 400 ఏండ్ల పురాతనమైన రామలింగేశ్వర దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతోపాటు రాడార్ ఏర్పాటు వల్ల ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని స్థానికుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. పూడూరు మండల ప్రజానీకం నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నట్టు ఆయన సభ దృష్టికి తెచ్చారు. స్థానికుల ఆందోళనలను పరిశీలించి కేంద్ర రక్షణ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేవీ రాడార్ స్టేషన్‌ను దామగుండం నుంచి మరో అనువైన ప్రదేశానికి మార్చాలని రంజిత్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

