చేర్యాల, జనవరి 11 : భవిష్యత్తులో ఆర్టిఫీషియిల్ ఇంటెలిజెన్స్ న్యాయవ్యవస్ధలో కీలక పాత్ర పోషించనుందని హైకోర్టు జడ్జి విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఫస్ట్‌క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ఆయన ప్రారంభించి మాట్లాడారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు చేర్యాల జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా జడ్జి సాయి రమాదేవి, ఇన్చార్జి కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి పాల్గొన్నారు.