Cherlapally Terminal | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయి దా వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 28న నూతన టెర్మినల్‌ను ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి హాజరుకానున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కానీ సాంకేతిక కారణాలతో టెర్మినల్ ప్రారంభాన్ని వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని పలు రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న 20 ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-రామనాథపురం, కాచిగూడ-మధురై, నాందేడ్-ఎరోడ, కాచిగూడ-నాగర్సోల్, తిరుపతి-సికింద్రాబాద్, లింగంపల్లి-కాకినాడ, హైదరాబాద్-కటక్, నర్సాపూర్-బెంగళూరు వంటి స్టేషన్ల మధ్య రైళ్లను పొడిగించినట్టు వెల్లడించారు.