చెన్నూర్, నవంబర్ 5 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్‌ను సిబ్బంది పేకాట క్లబ్బుగా మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్‌తోపాటు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో సోమవారం రాత్రి నుంచి చక్కర్లు కొడుతున్నది. దీంతో విధులను విస్మరించి, స్టేషన్లోనే పేకాట ఆడుతున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పేకాడిన సిబ్బందిపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై జిల్లా ఎైక్సైజ్ సూపరింటెండెం ట్ నందగోపాల్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.