చండూర్ : మునుగోడుకు పట్టిన దరిద్రం పోయి అభివృద్ధి జరగాలంటే ముందుగా రాజగోపాల్రెడ్డి శని వదిలిపోవాలని విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చండూర్ మున్సిపాలిటీ లో 1, 9 వార్డ్ లలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ, కేడీ లు ఎంత మంది వచ్చినా మునుగోడు లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని తెలిపారు.
బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్ షో తర్వాత పార్టీ క్యాడర్ లో జోష్ మరింత పెరిగిందని, ముఖ్యంగా యూత్ లో ఉత్సాహం ఉప్పొంగిందని తెలిపారు. మునుగోడును కూడా దత్తత తీసుకుంటా అని మంత్రి ప్రకటించడంతో నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.
మునుగోడు ప్రజలు అభివృద్ధి కి జై కొట్టి కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని బాల్క సుమన్ ధీమాను వ్యక్తం చేశారు.