ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయ శిల్పాలను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు రసాయనాలతో కడిగించనున్నారు. 2011లో ఈ శిల్పాలను కడిగించిన అధికారులు మళ్లీ ఇప్పుడు మెరుగులు దిద్దనున్నారు. దీంతో శిల్పాలపైనున్న దుమ్ము, ధూళి, పాకురు తొలగిపోయి తళతళ మెరువనున్నాయి. బుధవారం అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేయగా, సంక్రాంతి తర్వాత శుద్ధికార్యక్రమాన్ని చేపట్టనున్నారు. – వెంకటాపూర్