పాలకుర్తి : పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారంలో జనం భయాందోళనకు గురవుతున్నారు. పాలకుర్తి మండలం రానాపూర్ సమ్మక్క గద్దెల వద్ద చిరుత సంచరించగా.. బుధవారం పాదముద్రలను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలు చిరుతవిగా గుర్తించారు. ప్రస్తుతం చిరుత పులి భామల నాయక్ గ్రామ పంచాయతీకి ఆనికొని ఉన్న అడవి ప్రాంతం, రాణాపూర్ ఎన్టీపీసీ డ్యామ్ మధ్యలో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపుగా గ్రామస్తులు, పశువుల కాపరులు వెళ్లొద్దని అధికారులు సూచించారు. చిరుత పులి సంచారంతో రానాపూర్తోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను బంధించాలని కోరుతున్నారు.