చండూరు: నిత్యం ప్రజల్లో ఉండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యమ నాయకుడు మంత్రి జగదీశ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే స హించేది లేదని, టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు.
శుక్రవారం ఆయన రహదారి బంగ్లాలో నిరహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్‌గోపాల్‌రెడ్డి మతి, గతి లేకుండా మాట్లాడడం ఇప్పటికైనా మానుకో వాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. శేశిలేటి వాగు, వెల్మకన్నె ఫీడర్ ఛానల్, శివన్నగూడెం రిజర్వాయర్ తమ సొంత నిధులతో పూర్తి చేస్తానన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు.
మునుగోడులో తన అనుచరులను కాపాడుకోలేని నువ్వు సూర్యాపేటకు వెళ్లి రాజకీయాలు చేస్తాననడం సిగ్గనిపించడం లేదా అని అన్నారు. సూర్యాపేటకు వెళ్తే నిన్ను ఆప్రాంత ప్రజలు తరిమికొడతారన్నారు. నిత్యం మోసకారి మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేసి పబ్బం గడుపుకుంటున్న నీకు, ప్రజల మనిషి మంత్రితో పోలికా అని అన్నారు.
తను, నేను నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధమని సవాలు విసిరారు. కేఎపాల్గా మారిన ఆర్జీపాల్, అబద్దాలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి మునుగోడు నియోజకవర్గంలో ఇంకా చేరికలు ఉండబోతున్నాయని అన్నారు.
నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ నుంచి ప్రస్తుతం నీ కారు తిరిగే రోడ్ల వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసినవేనని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మరబోయిన వెంకన్న, అవ్వారి శ్రీను, మండల యువజన విభాగం అధ్యక్షులు ఉజ్జిని అనీల్‌రావు, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి వెంకన్న, చిలుకూరి రాధికశ్రీనివాస్, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, మహిళ విభాగం అధ్యక్షురాలు పెండ్యాల గీత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొ న్నారు.